మంచు మనోజ్ 'ఒక్కడు మిగిలాడు' ట్రైలర్

- August 18, 2017 , by Maagulf
మంచు మనోజ్ 'ఒక్కడు మిగిలాడు' ట్రైలర్

మంచు మనోజ్ లేటెస్ట్ మూవీ 'ఒక్కడు మిగిలాడు' ట్రైలర్ విడుదలైంది. భారతదేశంలో ఇంకా స్వతంత్ర పోరాటం జరుగుతూ ఉంటే అల్లూరి, భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఏమని పిలిచుకునేవారు? తీవ్రవాదులనా? లేక దేశ భక్తులనా? అనే వాయిస్‌తో ట్రైలర్‌ మొదలైంది. శ్రీలంకలో తమిళులు అనుభవించిన మానసిక క్షోభను కళ్లకు కట్టినట్లు చూపించినట్టు తెలుస్తోంది. ప్రపంచదేశాలు మనల్ని తీవ్రవాదులు అంటున్నాయి.. స్వేచ్ఛ కోసం సాయుధ పోరాటం తీవ్రవాదమైతే.. మనం తీవ్రవాదులమే అనే మరో డైలాగ్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అజయ్‌ ఆండ్రూస్‌ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి లక్ష్మీకాంత్‌, ఎస్‌ఎన్‌ రెడ్డిలు నిర్మిస్తున్నారు. మనోజ్ ఇందులో డబుల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.స్వాతంత్ర్య సమరయోధుడికి, తీవ్రవాదికీ మధ్య తేడా చెప్పగలిగేది ఒక్కటే! మనం చూసే దృష్టి.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com