తల తెగిపడి ముందు నేరస్థుడ్ని క్షమించిన బాధితుని తండ్రీ

- August 19, 2017 , by Maagulf
తల తెగిపడి ముందు నేరస్థుడ్ని క్షమించిన బాధితుని తండ్రీ

రియాద్: కన్న కొడుకుని కిరాతకంగా చంపిన హంతకుడిని క్షమించి శిరిచ్ఛేదనం శిక్ష నుంచి తప్పించిన ఆ తండ్రి అందరి అభిమానం చురగొన్నాడు. సౌదీ అరేబియాలోని ఖమిస్ ముషీత్ ప్రావిన్స్‌లోని అసీర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన కొడుకుని చంపిన వ్యక్తికి ప్రాణభిక్ష పెట్టాడు. తన కొడుకుని చంపిన వ్యక్తికి చట్టప్రకారం శిరచ్ఛేదం చేయబోతుండగా కేవలం నిమిషాల ముందు అడ్డుకున్నాడు. కొంతమందితో ఉరి తీసే ప్రాంతానికి వచ్చిన ఆ వ్యక్తి.. ‘నిందితుడిని క్షమిస్తున్నాను. తల నరకకండి .. వదిలేయండి’ అని కోరాడు. దీంతో నిందితుడిని క్షమాభిక్ష కింద వదిలేశారు. నిందితుడు రెండేళ్ల జైలుశిక్ష అనుభవించిన అనంతరం ఉరిశిక్ష విధించాలని నిర్ణయించారు. శిక్ష అమలుచేయడానికి నిమిషాల ముందు క్షమిస్తున్నానని ప్రకటించి ఓ మనిషి ప్రాణాలు నిలవడానికి కారణం అయినందుకు పెద్దాయనను అందరూ పొగిడారు. అక్కడున్న వారైతే భూజాలపై ఎక్కించుకుని జైజేలు పలికారు. కొడుకుని హత్య చేసిన వ్యక్తిని క్షమించావని ప్రశంసించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com