న్యూయార్క్ పరేడ్ లో ముఖ్య అతిథి గా రానా
- August 20, 2017
న్యూయార్క్‌లో ఇండియా డే పరేడ్ వేడుకలు అంబరాన్నంటాయి. దేశం బయట జరిగే అతిపెద్ద స్వతంత్ర దినోత్సవాలుగా భావించే ఈ పెరేడ్‌ను మిడ్ టౌన్‌లో నిర్వహించారు. 37వ ఆన్యువల్ ఇండియా డే పరేడ్‌కు న్యూయార్క్‌లో ఉన్న వేలాది మంది భారతీయులు హాజరయ్యారు. సంప్రదాయ దుస్తులతో ఆడిపాడారు.
ఇండియా డే పరేడ్ సందర్భంగా భారతీయ సంస్కృతిని గుర్తు చేస్తూ రకరకాల వంటకాలు ఏర్పాటు చేశారు. పరేడ్ జరిగే మార్గం పొడవునా ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసి వడ్డించారు. ఈసారీ ఇండియా డే పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి, అరుదైన గౌరవం అందుకున్నారు.
ఇండియా పరైడ్ తో రోడ్లపై ఒక్కసారిగా జనం, శకటాలు పోటెత్తాయి. పరేడ్ సాఫీగా జరగడానికి వీలుగా ట్రాన్స్‌పోర్టేషన్ డిపార్ట్‌మెంట్ కొన్ని రూట్స్ క్లియర్ చేసింది.. న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఇండియా పరేడ్‌కు అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 11 నుంచి సాయంత్రం ఆరు వరకూ అనుమతించింది. ఈ సందర్భంగా రకరకాల శకటాలను ప్రదర్శించారు.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







