జైహింద్ నినాదం చేసిన కెనడా ప్రధానమంత్రి
- August 22, 2017
కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో భారతీయ సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. క్యూబెక్‌లో జరిగిన ఇండియా డే పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు. పర్పుల్ కలర్ కుర్తా పైజామా ధరించి భారతదేశ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. అంతేకాదు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగం పూర్తి చేసిన తర్వాత 'జై హింద్' అని నినందించి అక్కడికి వచ్చిన వారందరి మనసులను గెలుచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన తన ట్విటర్ ద్వారా పోస్టు చేశారు. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధం కొనసాగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ పరేడ్‌లో కెనడాలోని భారత హైకమిషనర్ రాయబారి వికాస్ స్వరూప్ కూడా పాల్గొన్నారు.
కెనడా ప్రధానమంత్రి ఇండియా పరేడ్‌లో పాల్గొనడం పట్ల వికాస్ స్వరూప్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నెటిజన్లు ట్రూడోపై ప్రశంసలు కురిపిస్తున్నారు. భారతీయ సంప్రదాయాన్ని గౌరవించడం చాలా గర్వంగా ఉందంటూ ట్వీట్లు చేస్తున్నారు. జులై నెలలో టొరంటోలోని శ్రీస్వామినారాయణ ఆలయానికి వెళ్లిన సమయంలో కూడా ట్రూడో కుర్తా పైజామాలో వచ్చారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







