రాజీనామాకు సిద్ధపడ్డ రైల్వే మంత్రి సురేశ్ ప్రభు
- August 23, 2017
- ‘ఉత్కళ్’ ప్రమాద ఘటనకు నైతిక బాధ్యతగా నిర్ణయం
- తొందరపడొద్దన్న ప్రధాని మోదీ.. వేచిచూడాలని ఆదేశం
రైల్వే మంత్రి సురేశ్ ప్రభు సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారతీయ రైల్వేలో ఇటీవల భారీ ప్రమాదాలు చోటుచేసుకోవడం, పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలకు నైతిక బాధ్యతగా ఆయన తన పదవిని వదులుకునేందుకు సిద్ధపడ్డారు. ఈ విషయాన్ని సురేశ్ ప్రభునే స్వయంగా తన అధికారిక ట్విట్టర్ ద్వారా బుధవారం తెలిపారు.
‘ఇటీవల చోటుచేసుకున్న రెండు రైలు ప్రమాదాలు నన్ను తీవ్రంగా బాధించాయి. దీనికి నైతిక బాధ్యత వహించాలనుకున్నాను. కొద్ది సేపటి కిందటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి నా నిర్ణయాన్ని చెప్పాను’ అని సురేశ్ ప్రభు తెలిపారు.
తొందరపడొద్దన్న మోదీ: కాగా, రాజీనామా విషయంలో తొందరపాటు వద్దని సురేశ్ ప్రభుకు ప్రధాని మోదీ సూచించారు. ‘వేచిచూడండి..’ అని ప్రధాని తనతో అన్నట్లు రైల్వే మంత్రి చెప్పారు.
గత శనివారం ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా ఖతౌలి వద్ద పూరీ–హరిద్వార్ ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో 23 మంది మృతిచెందగా.. 60 మందికి పైగా గాయపడ్డ విషయం తెలిసిందే. దీనికి నైతిక బాధ్యతగా సురేశ్ ప్రభు రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







