బహ్రెయిన్ లో అంగరంగ వైభవంగా జరిగిన 'జయహో అమరావతి' శంకుస్థాపన మహోత్సవం

- October 25, 2015 , by Maagulf

బహ్రెయిన్ లో జయహో అమరావతి వేడుకలు అంగరంగ వైభవంగా తెలుగు వారు అంతా కలసి జరుపుకున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా డా| గజల్ శ్రీనివాస్ గారు విచ్చేసారు. జయహో అమరావతి వేదిక నలంకరించి మానవత్వం పరిమలింప చేసారు ... సమాజం లో అమ్మ, నాన్న, దేవుళ్ళు, గురువులు వాళ్ళే అని చాటి చెప్పారు. ఆయన గజల్ గానం విని పులకించిపోయారు . సమాజం లో విలువలు చాలా అవసరం అని చాటి చెప్పారు. మన సంస్కృతీ సాంప్రదాయాలను దేశ విదేశాల లో జరుపు కోవడం చాలా ఆనందం ఇస్తుంది అని అన్నారు . అమరావతి చరిత్ర పుటలులో నిలుస్తుంది అని అన్నారు . ఈ కార్యక్రమానికి వెన్నుముఖ అయినటువంటి శ్రీ R.v.రావు గారు మరియు హరిబాబు గారిని అందరూ అభినందించారు. ప్రపంచము లో ఎవరికీ రాని ఆలోచన తీసుకొని వచ్చి జయహో అమరావతిని తెలుగు ప్రజల మధ్య జయహో అనిపించారు. బహ్రెయిన్ ని శ్రీ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారాచంద్ర బాబు నాయుడు గారు అభినందించారు . ఇలాగే దేశ విదేశాలలో ఉన్న తెలుగువారంతా నవ్యాంధ్ర ప్రదేశ్ కోసం పాటుపడాలి అని అన్నారు.మన భవిష్యత్ అమరావతిని దిశ దశ మారుస్తుంది అని అన్నారు. జయహో అమరావతి కార్యక్రమము లో తెలుగు వారు అంతా ప్రాంతాలు కి అతీతంగా  పాల్గొన్నారు.

ఈ కార్యక్రమము విజయవంతం చేశారు.సభా ప్రాంగాణంలో ప్రేక్షకులు కరతాళ ధ్వనులు మధ్య జన గణ మన చెప్పి ముగించారు.

ఇందు లో మా ప్రతినిధి వాసుదేవ రావు గారు పాలు పంచుకున్నారు. తెలుగు జాతి నిండుగ వెలుగ జాతి అన్నారు.

 

ఈ కార్యక్రమాన్నిఘనంగా నిర్వహించిన నిర్వాహకులకు మాగల్ఫ్.కామ్ తరపున ప్రత్యేక అభినందనలు.

 

--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com