అణుక్షిపణులు ప్రయోగం కారణంగా ఉ.కొరియాపై అమెరికా కీలక నిర్ణయం
- August 23, 2017
తరచూ అణ్వస్త్ర ప్రయోగాలతో తలనొప్పిగా మారిన ఉత్తరకొరియా ఆటకట్టించే దిశగా అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అణుక్షిపణులు, ఆయుధాల తయారీలో ఉత్తర కొరియాకు సహకరిస్తున్న చైనా, రష్యాలకు చెందిన 10 కంపెనీలు, ఆరుగురు వ్యక్తులపై అమెరికా ఆంక్షలు విధించింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆయా కంపెనీలు, వ్యక్తులు వ్యవహరిస్తున్నందున వారి కార్యకలాపాలు స్తంభింపచేసినట్లు అమెరికా ఖజానా శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అణ్వస్త్ర వ్యాప్తికి కృషి చేస్తున్న ఉత్తరకొరియాకు సహకరించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అమెరికా హెచ్చరించింది. అణ్వస్త్ర నిరోధానికి ఉత్తరకొరియాపై ఒత్తిడి కొనసాగుతుందని స్పష్టంచేసిన ఖజానా శాఖ.. ఆ దేశానికి సహకరించే వారిని అమెరికా ఆర్థిక వ్యవస్థ నుంచి దూరం పెడతామని తేల్చిచెప్పింది. ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి సూచించిన మౌలిక సూత్రలనే ప్రభుత్వం అనుసరిస్తున్నట్లు అమెరికా ఖజానా మంత్రి స్టీవెన్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా







