దుబాయ్‌ మెట్రో స్టేషన్‌లో వ్యక్తి ఆత్మహత్య

- August 23, 2017 , by Maagulf
దుబాయ్‌ మెట్రో స్టేషన్‌లో వ్యక్తి ఆత్మహత్య

దుబాయ్‌లోని మెట్రో స్టేషన్‌లో ఉగాండాకి చెందిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో నూర్‌ బ్యాంక్‌ మెట్రో స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి బంధువులు పోలీసులకు తెలిపారు. ప్రత్యక్ష సాక్షి ఒకరు ఎస్కలేటర్‌ పైనుంచి వెళుతుండగా, భారీ శబ్దం విన్పించిందనీ, చూసేసరికి రక్తపు మడుగులో ఓ వ్యక్తి విగతజీవిగా పడి ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ఈ ఘటనతో కాస్సేపు మెట్రో సర్వీసులకు అంతరాయం కలిగింది. ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. అనంతరం సర్వీసులు యధాతథంగా కొనసాగాయి. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com