విశాఖలో టెక్ హబ్‌ను ప్రారంభించిన ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్

- August 24, 2017 , by Maagulf
విశాఖలో టెక్ హబ్‌ను ప్రారంభించిన ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్

ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విశాఖలో టెక్ హబ్‌ను ప్రారంభించారు. ఈ టెక్ హబ్ కేంద్రంగా అపెక్స్, వెంచర్ ఆఫ్ షోర్, ఐడీఏ, జివ డిజిటల్ సర్వీస్, అవ్య ఇన్వెంట్రాక్స్, వీజీఎస్, ఆమ్ జర్, విస్మయా ప్రీ మీడియా సర్వీసులు పనిచేయనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ..ఈ టెక్ హబ్‌ ద్వారా 4 వేల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా తొలి విడతలో 900మందికి ఉద్యోగాలు ప్రకటించినట్లు మంత్రి నారా లోకేష్ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com