సల్మాన్ ఖాన్ హీరోగా వస్తున్న 'రేస్-3'
- August 24, 2017
బాలీవుడ్‌లో 'ధూమ్' సీరిస్ చిత్రాల మాదిరే యాక్షన్ థ్రిల్లర్‌గా ఆడియెన్స్‌ను అలరించే మరో ఫ్రాంచైజ్ 'రేస్'. ఇప్పటికే రెండు చిత్రాలతో అలరించిన ఈ సిరీస్‌లో ఇప్పుడు మూడో చిత్రం రాబోతుంది.
హీరో-విలన్ మధ్య నువ్వా నేనా అంటూ రేసీగా సాగే యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ 'రేస్'. ఈ బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ఫ్రాంచైస్‌లో మొదటి సినిమా 'రేస్'.. 2008లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో సైఫ్ ఆలీ ఖాన్ హీరోగా నటించగా.. అక్షయ్ ఖన్నా విలన్ పాత్రలో అలరించాడు. 2013లో వచ్చిన 'రేస్' సీక్వెల్ 'రేస్-2'లో కూడా సైఫ్ ఆలీఖాన్ హీరోగా నటించగా.. జాన్ అబ్రహం విలన్ పాత్ర పోషించాడు.
'రేస్' ఫ్రాంచైజ్‌లో ఇప్పుడు మూడో సినిమా తెరకెక్కబోతోంది. ఈ సీక్వెల్‌లో సైఫ్ ఆలీ ఖాన్ కాకుండా.. సల్మాన్ ఖాన్ లీడ్ రోల్‌లో అలరించబోతున్నాడు. 'రేస్' మొదటి రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శక ద్వయం అబ్బాస్-మస్తాన్ ప్లేస్‌లో.. 'రేస్-3' కి రెమో డిసౌజా దర్శకత్వం వహించనున్నాడు. ఇక 'రేస్-2'లో నటించిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. ఇప్పుడు 'రేస్-3'లో సల్మాన్ సరసన హీరోయిన్‌గా నటించబోతోంది. త్వరలోనే ఈ సీక్వెల్ మూవీ పట్టాలెక్కనుందట. మరి సల్మాన్ రాకతో మొదటి రెండు పార్ట్‌లకు మించిన రీతిలో 'రేస్' మూడో పార్ట్ ఘన విజయాన్ని సాధిస్తుందేమో చూడాలి.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







