జమ్ముకశ్మీర్‌లో 35ఏ అధికరణపై దీపావళి తర్వాత విచారణ

- August 25, 2017 , by Maagulf
జమ్ముకశ్మీర్‌లో 35ఏ అధికరణపై దీపావళి తర్వాత విచారణ

జమ్ముకశ్మీర్‌లో శాశ్వత పౌరులకు ప్రత్యేక హక్కులు, సదుపాయాలు కల్పించే రాజ్యాంగంలోని 35ఏ అధికరణను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై దీపావళి తర్వాత విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దీపావళి తర్వాత వాదనలు జరిపేందుకు కేంద్రం ప్రభుత్వానికి సైతం ఎలాంటి అభ్యంతరం లేదని, విచారణ వాయిదా వేయాలని జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం మన్నించింది.
1954లో రాష్ట్రపతి అదేశం ద్వారా రాజ్యాంగానికి జోడించిన 35ఏ అధికరణ జమ్ముకశ్మీర్‌ శాశ్వత పౌరులకు ప్రత్యేక హక్కులు కల్పిస్తుంది.కశ్మీర్‌ మహిళ వేరే రాష్ట్ర వ్యక్తిని వివాహం చేసుకుంటే ఆమె ఆస్తి హక్కును కొల్పోతుందని ఆ అధికరణ చెబుతుంది. ప్రజల సమానత్వపు హక్కు లేదా రాజ్యాంగంలోని ఏదైనా హక్కును ఉల్లంఘిస్తుందని సవాలు చేసే వీలు లేకుండా ఎలాంటి చట్టాన్నైనా చేసేందుకు జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వానికి అధికారం కల్పిస్తుంది. 35ఏ అధికరణ సహా జమ్ముకశ్మీర్‌ రాజ్యాంగంలోని సెక్షన్‌ 6లోని ఇలాంటి నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. అవసరమైతే ఈ అంశంపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరుపుతుందని సుప్రీంకోర్టు చెప్పింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com