కతర్ విదేశాంగ మంత్రి భారతదేశంలో రెండు రోజుల పర్యటన
- August 25, 2017
న్యూ ఢిల్లీ: కతర్ విదేశాంగ మంత్రి షెఖ్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్-థానీ శుక్రవారం సాయంత్రం భారతదేశ రాజధాని న్యూఢిల్లీకి చేరుకొంటారని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఆయన రెండు రోజుల పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ, భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తో చర్చలు జరిపనున్నట్లు ప్రముఖ భారతీయ దినపత్రిక హిందూస్తాన్ టైమ్స్ తెలిపింది. గల్ఫ్ ప్రాంతంలో భారత్ కు కతర్ ఒక ముఖ్యమైన వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2014-15 మధ్య కాలంలో ఇరు దేశాల మధ్య జరిగిన వాణిజ్యం విలువ 15.67 బిలియన్ల డాలర్లగా నమోదైంది. భారతదేశానికి ముడి చమురు సరఫరా చేసే దేశాలలో కతర్ ఒక అతిపెద్ద సరఫరాదారుల్లో ఒకటిగా ఉంది. శనివారం ( రేపు ) కతర్ విదేశాంగ మంత్రి షెఖ్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్-థానీ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తో స్వరాజ్తో చర్చలు జరుపుతారు. ఆ తరువాత ఆయన ప్రధానమంత్రిని కలవనున్నారు.
తాజా వార్తలు
- తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..తీవ్ర వడగాలులు
- ఇక ఆన్లైన్లోనే వాహనాల రిజిస్ట్రేషన్
- బీసీసీఐ సంచలన నిర్ణయం..ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో కొత్త రూల్స్
- ఆంధ్ర ప్రదేశ్: టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం
- పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షలు
- సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!









