ఆదివారాల్లో అమ్మాయిల ట్రెక్కింగ్
- August 26, 2017
ఆదివారం. వీకెండ్. ఆ రోజు చాలామంది నిద్రలేచేసరికి ఏ తొమ్మిదో, పదో అవుతుంది. తిరుపతి నగరం కూడా అందుకు మినహాయింపేమీ కాదు. కానీ ఈ సిటీలో కొంతమంది నగరం నిద్రలేవడానికి ముందే రెడీ అయిపోతారు. లగేజీ సర్దుకుని ఒక్కచోటికి చేరుతారు. అలాగని వీళ్లేమీ టూర్‌కు వెళ్లడం లేదు. వీకెండ్‌ను ఎంజాయ్ చేయడానికి. కొండలు, గుట్టలు ఎక్కేస్తూ అడవుల్లో తిరిగేస్తారు. రియల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తారు. తెల్లవారకముందే బైకులు, స్కూటీలు, కార్లలో బయలుదేరుతారు. ఓ నిర్దేశిత ప్రాంతానికి చేరుకుని వాటిని పక్కనపెట్టేస్తారు.
ఒకరిద్దరు కాదు 150 మంది. పిల్లలు పెద్దలు అందరూ కలిసి కాలి నడకన ముందుకు వెళ్తారు. ఆ నడక అడవి వైపు సాగుతుంది. కొండలు ఎక్కుతూ దిగుతూ రాళ్లు, మట్టి దారిలో నడుచుకుంటూ వెళ్తారు. ఎంత దూరం నడిచినా అలుపూ సొలుపూ ఉండదు. ఎందుకంటే వీరంతా ఎవరి బలవంతంపైనో ఇలా అడవుల్లోకి వెళ్లడం లేదు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ... అణువణువు కొత్త శక్తిని నింపుకుంటూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఇది సాహస యాత్రకాదు. వాకింగ్ లాంటిదే. వీరంతా ఒక్కో అడుగు ముందుకేస్తుంటే కిలోమీటర్లకు కిలోమీటర్లు వెనక్కి వెళ్లిపోతాయి. ఇలా చాలా దూరం నడిచేది ఎవరి మెప్పుకోసమో కాదు. రికార్డుల కోసం అంతకన్నా కాదు. ఆరోగ్యం కోసం. అవును...చక్కని ఆరోగ్యం కోసమే
వీరంతా ట్రెక్కింగ్ చేస్తున్నారు. ఆరోగ్యం కోసమైతే ఏ జిమ్‌కో, పార్కుకో వెళ్తే సరిపోతుంది. ఇంతదూరం నడవాలా అని మాత్రం అనుకోకండి.
ట్రెక్కింగ్ కేవలం ఆరోగ్యం కోసమే కాదు. అనుభూతుల కోసం. సిటీల్లో ఎన్ని రౌండ్లు వేసినా దొరకని సంతోషం ఈ నడక ద్వారా లభిస్తుంది. నగరాల్లో గాలి కూడా కాలుష్యమైపోతోంది. కానీ ఈ అడవుల్లో స్వచ్ఛమైన గాలి పీల్చొచ్చు. ప్రకృతి పచ్చదనం అనువణువు కొత్త ఉత్సాహాన్నిస్తుంది. రకరకాల పూలు, పండ్లనిచ్చే చెట్లు, ఔషధ గుణాలున్న మొక్కలు, చెట్లకు లెక్కేలేదు. వీటి నుంచి వీచే గాలిని పీలిస్తే సువాసనలు, ఔషధాలు ఒంట్లోకి వెళ్లి రోగాలను దూరం చేస్తాయి. అదే సిటీల్లో గాలి పీలిస్తే లేనిపోని రోగాలొస్తాయి.
ఈ వీకెండ్ ప్రయాణంలో ఎంతోమంది కొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఇవి ఫేస్‌బుక్‌లో ముక్కూమొహం తెలియని వారితో చేసుకునే పరిచయాలకంటే ఎంతో మేలు. అంతేకాదు ఒకరికి తెలిసిన విషయం మరొకరు తెలుసుకునే వీలుకలుగుతుంది. ఈ పరిచయాలు చక్కని భవిష్యత్తుకు పునాదిగా మారే అవకాశం లేకపోలేదు....
మనకు షేరింగ్ నేర్పింది కూడా ప్రకృతే. ట్రెక్కింగ్‌లో ఆకలేస్తే రొట్టెముక్కలను షేర్ చేసుకున్నా కలిగే ఆనందం ఎంత డబ్బుపెట్టి కొందామన్నా రాదు. సిటీల్లో పిజ్జాలు, బర్గర్లను తినే ఆనందాని కంటే వందరెట్లు ఎక్కువ సంతోషం షేరింగ్ వల్ల లభిస్తుందని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.
ట్రెక్కింగ్ వల్ల ప్రకృతి ఒడిలో ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. ఎన్నో మరిచిపోలేని అనుభూతులను సొంతం చేసుకోవచ్చు. వీకెండ్ బోరింగ్‌గా గడిచిందనే అసంతృప్తి ఉండదు. కుటుంబసభ్యుల మధ్య అనుబంధాన్ని పెంచుతుంది. అందుకే ఆ ఆలోచన వచ్చిందే తడవుగా దీన్ని ఆచరణలో పెట్టారు తిరుపతికి చెందిన బర్డ్ మ్యాన్ కార్తీ. జనాన్ని ప్రకృతికి చేరువ చేయాలనే ఉద్దేశంతో 25 ఏళ్లక్రితమే మ్యాక్ మెజార్ అడ్వెంచర్ కమ్యూనిటీ అనే సంస్థను నెలకొల్పారు. ఏడాదిలో రెండుసార్లు ట్రెక్కింగ్ నిర్వహించేవారు. గత ఏడాది నుంచి వీకెండ్ ట్రెక్కింగ్‌ను ఇద్దరితో ప్రారంభించి ప్రస్తుతం 150 మంది పాల్గొనేలా చేశారు. ఒక్క తిరుపతి నుంచే కాకుండా చెన్నై, బెంగళూరు, పూణే ప్రాంతాల నుంచి కూడా ఆసక్తికలిగిన యువతీయువకులు ఇందులో
పాల్గొంటుండడం విశేషం.
ఒక్కో వారం ఒక్కో ప్రాంతానికి వెళ్లేలా ప్లాన్ చేస్తారు. బుధవారానికల్లా ప్లాన్ చేసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తారు. ఆదివారం రోజున నిర్దేశించిన ప్రాంతానికి ఉదయాన్నే చేరుకుంటే అందరూ కలిసి అక్కడి నుంచి ట్రెక్కింగ్ ప్రారంభిస్తారు. తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చుట్టివస్తున్నారు. కొత్తకొత్త విషయాలను తెలుసుకుంటున్నారు. వీళ్లు సాగిస్తున్న ట్రెక్కింగ్ మిగతా సిటీల్లోని వారిలోనూ స్ఫూర్తి రగిలిస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







