'కబాలి' కుమార్తె ధన్సిక 'వాలుజడ'!

- August 27, 2017 , by Maagulf
'కబాలి' కుమార్తె  ధన్సిక 'వాలుజడ'!

'కబాలి' చిత్రంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె పాత్ర పోషించిన నటి ధన్సిక. ఆమె పలు తమిళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె తెలుగులో నటిస్తున్న చిత్రం 'వాలుజడ'. నివిన్‌ పౌలీ కథానాయకుడు. రమణ మల్లం దర్శకుడు. సింహ వాహిని చలన చిత్రం, సాయి వైభవి స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రాధన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.
ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం ఆదివారం విడుదల చేసింది. ఇందులో కథానాయిక ధన్సికను మాత్రమే చూపించారు. మరోపక్క ధన్సిక 'సోలో' అనే మలయాళ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో దుల్కర్‌ సల్మాన్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com