టెక్సాస్‌లో హరికేన్ హార్వే ధాటికి నిరాశ్రయులైన 60లక్షల మంది
- August 28, 2017హరికేన్ హార్వే ధాటికి టెక్సాస్ విలవిల్లాడుతోంది. హరికేన్ దెబ్బకు ఇప్పటికే ఐదుగురు మృతి చెందగా 14 మంది గాయపడ్డారు. గంటకు 130 మైళ్ల వేగంతో వీస్తున్న గాలులకు చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. ఎటు చూసినా ధ్వంసమైన ఇళ్లతో టెక్సాస్ మరుభూమిని తలపిస్తోంది.
హరికేన్ హార్వే టెక్సాల్‌లో విలయం సృష్టిస్తోంది. హార్వే కారణంగా ఇప్పటివరకు ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు. హార్వే ధాటికి హ్యూస్టన్, హారిస్ కౌంటీలలో 24 గంటల్లో 70 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గాలులదెబ్బకు చెట్లు, విద్యుత్తు స్తంభాలు కూలిపోయాయి. సుమారు మూడు లక్షల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
అయితే హార్వే విలయం ఇంకా ముగియలేదు. రాబోయే రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో వంద సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదు కానుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు.. హరికేన్ విధ్వంసానికి కుప్పకూలిన చెట్లు, విద్యుత్తు స్తంభాలను తొలగించడానికి రెండు వేల మంది సైనికులను రంగంలోకి దించారు. హార్వే ధాటికి ఇబ్బంది పడుతున్న ప్రజలకు సహకరించడానికి, కనిపించకుండా పోయినవారిని వెదకడానికి, సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి మరో వెయ్యిమంది సహాయక సిబ్బందిని ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు