వచ్చే నెల 6, 7, 8 తేదీలలో గోదావరి జలసిరికి హారతి
- August 28, 2017
వచ్చే నెల 6, 7, 8 తేదీలలో జలసిరికి హారతి కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నదులు.. చెరువులతో సహా.. రాష్ట్రంలోని అన్ని జలవనరులను ఆ మూడు రోజులు పూజించుకునేలా.., ఇందులో ప్రజలు భాగస్వామ్యులు అయ్యేలా చూడాలని సూచించారు. పోలవరం సహా 28 ప్రాజెక్టుల పనులపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
అమరావతిలో సీఎం చంద్రబాబు పోలవరం సహా 28 ప్రాజెక్టుల పనుల తీరుతెన్నులపై సమగ్రంగా సమీక్షించారు. 38వ సారి పోలవరం పనుల పురోగతిపై వర్చువల్ ఇన్‌స్పెక్షన్ చేశారు. వర్షాల కారణంగా ఈనెల మొదటి రెండు వారాలు పనులు ఆలస్యమయ్యాయని, అయితే ఎన్నడూ లేనంతగా ఈవారం మాత్రం రికార్డు స్థాయిలో 21 వేల 226 క్యూబిక్ మీటర్ల వరకు స్పిల్‌వే, స్టిల్లింగ్ బేసిన్ కాంక్రీట్ పనులు జరిగాయని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. అయితే రోజుకు కాంక్రీట్ పనుల సరాసరి 3 వేల 50 క్యూబిక్ మీటర్ల మేర మాత్రమే చాలవని, 4 వేల నుంచి 5 వేల క్యూబిక్ మీటర్ల వరకు పనుల వేగం పెరగాల్సి వుందని ముఖ్యమంత్రి సూచించారు. అటు.. స్పిల్ చానల్, లెఫ్ట్ ఫ్లాంక్‌కు సంబంధించి రెండున్నర లక్షల క్యూబిక్ మీటర్ల మేర మట్టి తవ్వకం పూర్తయ్యింది. మొత్తం రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్, 15 ఆర్మ్ గ్రైడర్ల ఫ్యాబ్రికేషన్ పూర్తయ్యింది. ఈనెల 24న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశమై ప్రాజెక్టు డిజైన్లు, నిర్మాణం తీరుతెన్నులను సమీక్షించిందని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 15 నాటికి యాగ్రిగేట్ కూలింగ్ ప్లాంట్ సిద్ధమవుతుందని చెప్పారు. అటు.. గిరిజనులకు న్యాయం చేస్తూ, ముంపు ప్రాంతాలలో భూసేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేస్తున్నామని సీఎంకు అధికారులు వివరించారు.
మరోవైపు.. రాష్ట్రంలో నీటికివ్వాల్సిన ప్రాధాన్యతను తెలియజేస్తూ..సీఎం చంద్రబాబు కొత్త కార్యక్రమానికి నాంది పలికారు. వచ్చే నెల 6, 7, 8 తేదీలలో జలసిరికి హారతి కార్యక్రమం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నదుల దగ్గర నుంచి చెరువుల వరకు రాష్ట్రంలోని అన్ని జలవనరులను ఆ మూడు రోజులు పూజించుకునేలా.., ఇందులో ప్రజలు భాగస్వామ్యులు అయ్యేలా చూడాలని సూచించారు.
విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని, సెప్టెంబర్‌లో కాస్త తగ్గుముఖం పడతాయని ఇస్రో అధికారులు సీఎంకు చెప్పారు. భూగర్భ జలాలు సమృద్ధిగా వున్నాయని అధికారులు చెప్పడంతో కొత్తగా బోర్లకు అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..
- రేపే ఏపీకి ప్రధాని మోదీ..
- సెర్బియా పర్యటన ముగించుకుని యూఏఈ అధ్యక్షుడు స్వదేశానికి తిరుగు ప్రయాణం
- మారనున్న విశాఖ రైల్వే స్టేషన్ రూపురేఖలు!







