మాఫియా డాన్ గా రాబోతున్న హీరో శర్వానంద్

- August 29, 2017 , by Maagulf
మాఫియా డాన్ గా రాబోతున్న హీరో శర్వానంద్

యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'మహానుభావుడు' చేస్తోన్నాడు., తన తదుపరి సినిమాను సుధీర్ వర్మ దర్శకత్వంలో చేయనున్నాడు. 'స్వామిరారా' .. 'కేశవ' వంటి చిత్రాల ద్వారా దర్శకుడిగా తన సత్తాను చాటుకున్న ఆయన, శర్వానంద్ తో సినిమా చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో కథానాయకుడు ఒక సామాన్యుడిగా తన జీవితాన్ని మొదలుపెట్టి, మాఫియా సామ్రాజ్యానికి అధినేతగా ఎదుగుతాడు. కథను బట్టి ఆయా వయసులవారీగా శర్వానంద్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఒక్కో దశలో ఒక్కో లుక్ తో ఆయన కనిపించనుండటం విశేషం. సెప్టెంబర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com