టార్చ్‌ టవర్‌ అగ్ని ప్రమాదం: కారణమిదే

- August 30, 2017 , by Maagulf
టార్చ్‌ టవర్‌ అగ్ని ప్రమాదం: కారణమిదే

దుబాయ్‌ మెరీనా టార్చ్‌ టవర్‌లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి కారణం తెలిసింది. పోలీసు అధికారులు ఆ ఘటనకు గల కారణాన్ని వెల్లడించారు. అప్పర్‌ ఫ్లోర్‌ నుంచి సిగరెట్‌ని ఆర్పకుండా కిందికి విసిరేయడంతో, అది కాస్తా భారీ అగ్ని ప్రమాదానికి కారణమయ్యిందని తెలిపారు పోలీసులు. దుబాయ్‌ పోలీస్‌ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ అబ్దుల్లా ఖలీఫా అల్‌ మర్రి తెలిపిన వివరాలు ప్రకారం, పై ఫ్లోర్‌ నుంచి విసిరేసిన సిరగరెట్‌, కిందన బాల్కనీలో ఉన్న పాట్‌లో పడి, అది కాస్తా నిప్పుగా మారి, భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆగస్ట్‌ 4న ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎవరూ చనిపోయకపోయినా, 38 ఫ్లాట్లు మాత్రం డ్యామేజ్‌ అయ్యాయి. విచారణను 10 రోజుల్లో పూర్తి చేసినట్లు క్రిమినల్‌ ఎవిడెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ ఇబ్దిసామ్‌ అల్‌ అబ్దౌలి చెప్పారు. సిగరెట్‌ కారణంగా అగ్ని ప్రమాదం జరగడం ఇదే తొలిసారి కాదని, ఇటువంటి ఘటనలు గతంలో కూడా జరిగాయని పోలీసులు అంటున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com