దుబాయ్ పోలీసులు కొత్త ఆన్ లైన్ సర్వే..
- October 27, 2015మీరు అసంతృప్తిగా ఉన్నారా? అయితే మీకు మేం కాల్ చేస్తాం అంటున్నారు దుబాయ్ పోలీసులు. 2021 నాటికి ప్రపంచంలోని టాప్ టెన్ సంతోషకరమైన నగరాల జాబితాలో చోటు సంపాదించే ఉద్దేశంతో దుబాయ్ పోలీసులు ఈ మేరకు కొత్త ఆన్ లైన్ సర్వే చేపట్టారు. ఈ సర్వే ప్రకారం మీరు ఆనందంగా ఉన్నారా? మాములుగా ఉన్నారా? బాధగా ఉన్నారా? అని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఆన్ లైన్ సర్వేలో ఎవరైనా తాము అసంతృప్తిగా ఉన్నట్టు ఆప్షన్ ఎంపిక చేస్తే.. వారికి పోలీసులు కాల్ చేసి మాట్లాడనున్నారు. వారి అసంతృప్తికి కారణాలు తెలుసుకోనున్నారు. ఇప్పటికే దుబాయ్ చాలా రంగాల్లో పేరుగాంచింది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన కట్టడమూ ఇక్కడే ఉంది. ఈ నేపథ్యంలో ఆనందకరమైన నగరాల జాబితాలో అగ్రస్థానంలో ఉండాలని ప్రయత్నిస్తున్నది. అయితే ఇందుకు నిర్వహిస్తున్న ఈ సర్వేలో ఎవరైనా అసంతృప్తిగా ఉన్నామని చెప్తే వారికి పోలీసులు కాల్ చేయడం ఏమిటని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 'ద హ్యాపీనెస్ ఇండస్ట్రీ: హై ద గవర్న్ మెంట్ అండ్ బిగ్ బిజినెస్ సోల్డ్ అస్ వెల్-బియింగ్' రచయిత విలియమ్ డేవిస్ ఈ సర్వేపై స్పందిస్తూ 'ఇది ప్రజలను భయపెట్టే సర్వేలా నాకు అనిపిస్తున్నది. ఎవరైనా పొరపాటున తాము అసంతృప్తిగా ఉన్నామంటే.. 'ఏంటి సంగతి' అని పోలీసుల నుంచి వారికి కాల్ రావడం ఒక రకంగా భయపెట్టేదే' అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..