కొడుకును డైరెక్ట్ చేయబోతున్నతండ్రి పూరి జగన్నాధ్

- August 31, 2017 , by Maagulf
కొడుకును డైరెక్ట్ చేయబోతున్నతండ్రి పూరి జగన్నాధ్

పైసా వసూల్ మూవీ ప్రమోషన్స్ లలో బిజీ గా ఉన్న పూరి , ఈ మూవీ తర్వాత ఎవరితో చేస్తాడా అని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ , మహేష్ బాబు లతో సినిమాలు ఉంటాయని ప్రచారం జరుగుతున్న పూరి మాత్రం వారథి కాకుండా తన తనయుడు ఆకాష్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని వినికిడి. బాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆకాష్ , ఆంధ్రపోరి మూవీ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కాకపోతే ఆ మూవీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోవడం తో ఆకాష్ కు హీరోగా గుర్తింపు రాలేదు.
ప్రస్తుతం ఆకాష్ నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. యాక్షన్ , డాన్స్ మొదలగునవి వాటిని ఆకాష్ నేర్చుకునే పనిలో ఉన్నాడట. ఇటు పూరి కూడా తన తనయుడికి సరిపోయే కథని రెడీ సిద్ధం చేసాడని సమాచారం. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మూవీ కి సంబదించిన పూర్తి వివరాలు పైసా వసూల్ రిలీజ్ తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com