సురేష్ బాబు చేతుల మీదుగా 'మెంటల్ మదిలో..' ట్రైలర్
- August 31, 2017
'పెళ్ళిచూపులు' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను అందించిన నిర్మాత రాజ్ కందుకూరి నిర్మిస్తున్న తాజా చిత్రం 'మెంటల్ మదిలో'. శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకుడు. పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకొన్న వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ.. 'ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్ లో కథ గురించి చెప్పిన విషయాలు ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. 'పెళ్ళిచూపులు' తరహాలోనే 'మెంటల్ మదిలో' కూడా ఘన విజయం సాధించాలని కోరుకొంటున్నాను. వివేక్ ఆత్రేయ ఓ సరికొత్త ప్రయత్నంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు' అన్నారు.
నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. 'సురేష్ బాబుగారు మా 'మెంటల్ మదిలో' ట్రైలర్ ను విడుదల చేసి.. క్వాలీటీ అండ్ కంటెంట్ చూసి మమ్మల్ని అభినందించడం చాలా ఆనందంగా ఉంది. చాలా పాజిటివ్ బజ్ ఉన్న సినిమా ఇది. మా టీం అంతా కూడా సినిమా రిజల్ట్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. త్వరలోనే ఆడియో విడుదల చేసి.. విడుదల తేదీని ప్రకటిస్తాం' అన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







