శ్రీను వైట్లకి ఛాన్స్ ఇస్తున్న మాస్ మహారాజ
- August 31, 2017
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలందరిలోకి అత్యంత ఇబ్బందుల్లో ఉన్న హీరో ఎవరు అంటే మాస్ మహారాజా రవితేజా పేరు మాత్రమే చెపుతారు. ఒకప్పుడు నిర్మాతలకు మినిమమ్ గ్యారెంటీ హిట్ హీరోగా అనేక విజయాలు అందుకున్న ఈ హీరో గత కొన్నేళ్లలో తీవ్రంగా నెగిటివ్ ట్రెండ్ లో ఉన్నాడు.
ఒకానొక సమయంలో తన దగ్గరికి వచ్చిన ప్రతి సినిమానూ ఒప్పుకుని చాల స్పీడుగా సినిమాలు చేసేయడంతో మాస్ మహారాజాకు ఇలా వరుస ఫ్లాపులు వచ్చాయి అన్న కామెంట్స్ ఉన్నాయి. ఆ మధ్యలో 'బలుపు' 'పవర్' లాంటి సినిమాలతో కొంత వరకు హిట్ ట్రాక్ ఎక్కినా తిరిగి 'కిక్-2' 'బెంగాల్ టైగర్' సినిమాలతో ఫ్లాపుల హీరోగా మారిపోయాడు.
దీనితో దాదాపు రెండేళ్ల విరామం తర్వాత రవితేజ కొత్త సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఈ మూవీ ఎట్టి పరిస్థితులలోను హిట్ కొట్ట వలిసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఇలాంటి అయోమ పరిస్థితులలో రవితేజ తన ఒక నాటి మిత్రుడు శ్రీను వైట్లను ఆదుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండటం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.
'ఆగడు' 'బ్రూస్ లీ' 'మిస్టర్' లాంటి డిజాస్టర్లతో కెరీర్ పాతాళానికి పడిపోయిన శ్రీను వైట్లతో సినిమాలు చేయాడానికి మిడిల్ రేంజ్ హీరోలు కూడ భయ పడిపోతున్న నేపధ్యంలో మాస్ రాజా తానూ ధైర్యం చేయడమే కాకుండా ఆ మూవీ ప్రాజెక్ట్ కు నిర్మాతను కూడ సెట్ చేయడం పెద్ద హాట్ న్యూస్ గా మారింది. అయితే 'రాజా ది గ్రేట్' ఫలితంలో తేడాలు వస్తే రవితేజ ఆలోచనలలో కూడ మార్పులు రావచ్చు అని అంటున్నారు.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో దర్శకుడు శ్రీనువైట్ల చాల బిజీగా ఉన్నట్లు టాక్. మరి ఈచివరి అవకాశాన్ని శ్రీను వైట్ల ఎంత వరకు ఉపయోగించుకోగలడో చూడాలి..
తాజా వార్తలు
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా







