ఈద్ అల్ అదా ప్రార్థనలు నిర్వహించిన రూలర్స్
- September 01, 2017
ఊఏఈ వ్యాప్తంగా రూలర్స్ ఈద్ అల్ అదా ప్రార్థనల్ని శుక్రవారం నిర్వహించారు. 'ఫీస్ట్ ఆఫ్ శాక్రిఫైజ్' సందర్భంగా ఈ ప్రత్యేక ప్రార్థనల్ని నిర్వహించారు. సుప్రీం కౌన్సిల్ మెంబర్స్, ఎమిరేట్స్ రూలర్స్ ఈద్ అల్ అదా ప్రార్థనల్ని తమ తమ ఎమిరేట్స్‌లో పలు మసీదుల్లో నిర్వహించడం జరిగింది. ముస్లిం సమాజానికి ఈద్ ఎంతో ఆనందోత్సాహాలకు నెలవైన పండుగ. పిల్లలు, పెద్దలు ఎంతో ఉత్సాహంగా ఈ పండుగ సంబరాల్లో పాలుపంచుకున్నారు. దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ జబీల్ మాస్క్‌లో ఈద్ అల్ అదా ప్రార్థనలు నిర్వహించారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ కూడా షేక్ మొహమ్మద్‌తో కలిసి ఈద్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. షార్జా రూలర్ డాక్టర్ షేక్ సుల్తాన్, అల్ బదీయా మాస్క్‌లో ప్రార్థనలు నిర్వహించగా, అజ్మన్ రూలర్ షేక్ హుమైద్ అల్ నౌమి - రషీద్ బిన్ హుమైద్ అల్ నౌమి మాస్క్‌లో ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. ఉమ్ అల్ ఖైవాన్ షేక్ సౌద్ అల్ ముల్లా, రస్ అల్ ఖైమా రూలర్ షేక్ సౌద్ అల్ ఖాసిమి, ఫుజారియా రూలర్ షేక్ హమాద్ అల్ షర్కి కూడా తమ తమ ఎమిరేట్స్‌లోని మసీదుల్లో ప్రత్యేక ఈద్ ప్రార్థనల్ని నిర్వహించారు. వీరి వెంట పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్‌కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్‌డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









