తిరుపతి చేరుకున్న భారత్ రాష్ట్రపతి
- September 01, 2017
రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరుపతికి విచ్చేశారు. ఆయనకి రేణుగుంట విమానాశ్రయంలో ఏపీ ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. గవర్నర్ నరసింహన్, సీఎం చంద్ర బాబు రాష్ట్రపతి స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితో పాటు ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, లోకేశ్, అమర్ నాథ్ రెడ్డి, కళా వెంకట్రావు, పితాని సత్యనారాయణ ఉన్నారు.
రేణిగుంట విమానాశ్రయం నుంచి రాష్ట్రపతి నేరుగా తిరుచానూరు చేరుకుని పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల ప్రాంగణంలో రూ.140 కోట్లతో నిర్మించిన శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పౌర సన్మాన కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొంటారు.
రాష్ట్రపతి రెండు రోజుల పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పాటు తిరుపతిలోనే ఉండనున్నారు. రాష్ట్రపతితో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాష్ట్రపతి కోవింద్ రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







