ఓమాన్ లో పేలిన ఫిరంగి....ముగ్గురికి గాయాలు

- September 02, 2017 , by Maagulf
ఓమాన్ లో పేలిన ఫిరంగి....ముగ్గురికి గాయాలు

 ఒమన్ శర్ఖియా ప్రాంతంలోని  విలయాట్ లో ఉన్న డామా వా'ఆల్ టైనే యొక్కఒక ఫిరంగిని తొలగిస్తున్న సమయంలో అది ఆకస్మికంగా పేలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారాణి రాయల్ ఒమాన్ పోలీస్ తెలిపారు. గాయపడిన వారి పేర్లు వివరాలు తెలియరాలేదు. ప్రమాదవశాత్తు తుపాకీ మందు బైటకు వెలువడటంతో పేలుడు సంభవించినట్లు పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు.  ఫిరంగిని పేల్చే వ్యక్తి తప్పుగా నిప్పుని వెలిగించడంతో అది పెద్ద శబ్దంతో పేలింది. అయితే అదృష్టవశాత్తూ గాయపడిన ముగ్గురు స్వల్ప గాయాలతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. క్షతగాత్రులను  సమీపంలోని ఆసుపత్రికి తరలించారు, రాయల్ ఒమాన్ పోలీసులు ఏ పేలుడుపై  సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com