అల్ అయిన్‌లో న్యూ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం
- September 02, 2017
అబుదాబీ: అల్ అయిన్‌లో కొత్త ఎడ్యుకేషనల్ ఫెసిలిటీ అలాగే కమ్యూనిటీ స్పేస్ త్వరలో ప్రారంభం కానుంది. టెక్నాలజీ మరియు డిజిటిల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఉచిత క్లాసులు ఇక్కడ నిర్వహిస్తారు. అల్ బాయెత్ మిత్వాహిద్ అసోసియేషన్ ఈ ఇన్నోవేషన్ హబ్‌ని డెవలప్ చేసింది. గూగుల్, ఎడ్యుకేషన్ సెక్టార్ రెగ్యులేటర్ అబుదాబీ ఎడ్యుకేషన్ కౌన్సిల్‌తో కలిసి అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ కోర్టు ఎంప్లాయీస్ ఈ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటులో తమవంతు పాత్ర పోషించాయి. సమాజాంలో టెక్నాలజీ అత్యద్భుత మార్పులకు కారణమవుతోందనీ ప్రతి ఒక్కరూ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా నిర్వాహకులు పేర్కొన్నారు. రెగ్యులర్ క్లాసులు, అలాగే వర్క్‌షాప్‌లను ఇక్కడ నిర్వహిస్తారు. 16 నుంచి 24 మధ్య వయసున్నవారికీ, 8 నుంచి 16 ఏళ్ళ వయసున్నవారికీ రకరకాల విభాగాల్లో శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మెషీన్ లెర్నింగ్ ఏరియా, త్రీడీ ప్రింటింగ్, రోబోటిక్స్, లేజర్ కటింగ్ తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







