'ఎక్కడికి పోతావు చిన్నవాడా' పరిస్థితి ఎదురైయింది మన హీరో కి
- September 02, 2017
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌కు గుంటూరులో చేదు అనుభవం ఎదురైంది. నగరంలో ఏర్పాటు చేసిన ఓ జిమ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నిఖిల్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. ఈ ఊహించని ఘటనతో అక్కడున్నవారంతా కొద్దిసేపు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
నిఖిల్ ప్రారంభించే జిమ్ భవనంలోని మూడో అంతస్థులో ఉండడంతో పైకి వెళ్లేందుకు నిర్వహకులతో పాటు అతడు కూడా లిఫ్ట్ ఎక్కాడు. లిఫ్ట్ పైకి వెళ్లిన తర్వాత డోర్లు ఓపెన్ కాకుండా పది నిమిషాల పాటు ఆగిపోయింది. దీంతో నిర్వహకులు లిఫ్ట్‌ను ఆన్, ఆఫ్ చేసినా ఫలితం లేకపోవడంతో అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి, గడ్డపారల సాయంతో లిఫ్ట్‌ను పగులగొట్టి నిఖిల్‌ను బయటికి తీసుకొచ్చారు. దీంతో నిర్వహకులతో పాటు అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. తీవ్రం గందరగోళ పరిస్థితి అనంతరం నిఖిల్ జిమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నాడు.
తాజా వార్తలు
- ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!
- అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!
- షార్జాలో రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన టాక్సీ..!!
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC







