'ర్యాలీ ఫర్ రివర్స్' కు మద్దతు ఇవ్వమని పిలుపునిచ్చిన అన్నయ్య

- September 02, 2017 , by Maagulf
'ర్యాలీ ఫర్ రివర్స్' కు మద్దతు ఇవ్వమని పిలుపునిచ్చిన అన్నయ్య

తెలుగు ఇండస్ట్రీలో మకుటం లేని మహరాజుగా వెలిగిపోయిన హీరో మెగాస్టార్ చిరంజీవి. అలనాటి టాప్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల తర్వాత అంత గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో మెగాస్టార్ చిరంజీవి. హీరోగా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో 'శంకర్ దాదా జిందాబాద్' చిత్రం తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు. కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా వ్యవహరించారు చిరంజీవి.
ఈ సంవత్సరం వివివినాయక్ దర్శకత్వంలో 'ఖైదీ నెంబర్ 150' చిత్రంతో మళ్లీ అభిమానులకు కనువిందు చేశారు. చాలా మంది చిరంజీవి ఛరిష్మా తగ్గిపోయింది..ఆయన సినిమాలకు పనికిరారూ..అంటే కామెంట్స్ చేసిన వారికి 'ఖైదీ నెంబర్ 150' చిత్రంతో దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ బ్రహ్మరథం పట్టారు మెగా అభిమానులు.
 
చిరంజీవి కేవలం సినిమా నటుడిగానే కాకుండా సామాజిక సేవా దృక్ఫదం కలిగిన వ్యక్తి..అందుకే ఆయన బ్లెడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మందికి సహాయం అందుతుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఉద్యమానికి పిలుపునిచ్చారు. మనకు జీవనాధారం అయిన నదులు ఈ మద్య కాలుష్యం భారిన పడి ఎండిపోతున్నాయి.
ముఖ్యంగా వర్షాలు సరిగా పడక చెరువులు, కాల్వలు చివరికి నదులు కూడా ఇంకి పోయే ప్రమాద పరిస్థితికి చేరుకుంది. అలా నదులు ఎండిపోతున్నాయని, వీటిని కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు చిరంజీవి. అలా చేయని పక్షంలో భవిష్యత్ తరాలకు నీరు చుక్క దొరకని పరిస్థితి ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. నదులను కాపాడేందుకు 'ర్యాలీ ఫర్ రివర్స్' మద్దతు ఇద్దామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు చిరంజీవి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com