న్యూ లుక్ లో 'సాహో' కోసం రెడీ అవుతున్న ప్రభాస్
- September 03, 2017
బాహుబలి లో రాజుగా కనిపించి రాజసం ఉట్టిపడేలా ఆకృతిని మార్చుకొన్న ప్రభాస్ తాజా సినిమా సాహో కోసం ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోయేలా, ఇండస్ట్రీ కూడా షాక్ అయ్యేలా బాహుబలి పూర్తిగా మారిపోతున్నాడు. బాహుబలితో దేశ వ్యాప్తంగా వచ్చిన క్రేజ్ ని వాడుకొని బాలీవుడ్ లో అడుగు పెట్టడానికి ఫోకస్ చేస్తోన్న ప్రభాస్, అందుకు తగినట్లుగానే తనని తాను మేకోవర్ చేసుకొంటున్నాడు.
ప్రభాస్ సాహో సినిమా కోసం టోటల్ గా మారిపోతున్నాడు. బాహుబలి సీరిస్ కోసం వారియర్ గా మారిపోయి బాక్సాఫీస్ ను షేక్ చేసిన యంగ్ రెబల్ స్టార్ ఇప్పుడు ఫుల్ స్టైలిశ్ లుక్ లోకి వచ్చేస్తున్నాడు. సుజిత్ దర్శకత్వంలో 100కోట్ల బడ్జెట్ తో స్టైలిశ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న సినిమాలో బాలీవుడ్ కటౌట్ లా కనిపించబోతున్నాడు ప్రభాస్. రీసెంట్ గా వచ్చిన లుక్ అయితే చాలా ఇంప్రెసివ్ గా ఉంది.
తెలుగు, తమిళ్, మలయాళం, హిందీల్లో తెరకెక్కుతోన్న సాహో సినిమా కోసం ప్రభాస్ చాలా వర్కవుట్స్ చేశాడు. మల్టీలింగ్వల్ సినిమాలో యూనిక్ గా కనిపించడానికి స్పెషల్ ట్రైనర్స్ ను ఎప్పాయింట్ చేసుకున్నాడు. వెయిట్ లాస్ నుంచి హెయిర్ స్టైల్ వరకు అన్నింటిని మార్చేసుకున్నాడు. మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు. దుబాయ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథకు పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యేలా తనను తాను మార్చుకుని ఇప్పుడు సాహో షూటింగ్ కు రెడీ అయిపోయాడు.
ప్రభాస్ ఇంత స్టైలిశ్ గా మారిపోయి, న్యూ అవతార్ తో థ్రిల్ చేస్తోన్న సాహోలో శ్రద్దా కపూర్ హీరోయిన్ గా చేస్తోంది. నీల్ నితిన్ ముఖేష్ విలన్ గా చెయ్యబోతున్నాడు. తెలుగు సినిమా అయినా బాలీవుడ్ లుక్ లో కనిపిస్తోన్న ఈసినిమా వచ్చే ఏడాది రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే నేషనల్ వైడ్ గా బజ్ క్రియేట్ చేస్తోన్న ఈసినిమా ప్రభాస్ కు ఏ రేంజ్ హిట్ ఇస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







