వన్డేల్లో ప్రపంచ రికార్డుని నెలకొల్పిన ధోని
- September 03, 2017
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వన్డే చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో 100 స్టంపౌట్స్ చేసిన ఏకైక వికెట్ కీపర్‌గా నిలిచాడు. శ్రీలంకతో ఆదివారం కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక క్రికెటర్ ధనంజయని స్టంపౌట్ చేయడం ద్వారా ధోని ఈ రికార్డు అందుకున్నాడు.
ఈ సిరీస్‌లోనే 99 స్టంపౌట్స్‌తో శ్రీలంక మాజీ వికెట్ కీపర్ కుమార సంగక్కరని సమం చేసిన ధోని, తాజాగా స్టంపింగ్‌తో అతడి రికార్డుని అధిగమించాడు. లంక ఇన్నింగ్స్ లో భాగంగా 45 ఓవర్ చివరి బంతికి దనంజయను ధోని స్టంపింగ్ చేశాడు. చాహల్ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చి షాట్ కోసం ధనంజయ ప్రయత్నించాడు.
అనూహ్యంగా టర్న్ తీసుకున్న బంతి నేరుగా ధోని చేతుల్లోకి వెళ్లింది. క్షణాల వ్యవధిలోనే ధోని వికెట్లను గీరాటేయడంతో అతని ఖాతాలో వంద స్టంపౌట్స్ చేరాయి. 2004, డిసెంబరు 23న వన్డేల్లోకి అరంగేట్రం చేసిన మహేంద్రసింగ్ ధోని తన కెరీర్లో ప్రస్తుతం 301వ వన్డే ఆడుతున్నాడు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







