బ్యాంక్ ఖాతాల స్తంభన కేంద్రం ఆదేశాలు
- September 05, 2017
ఆర్వోసీ నుంచి తొలగింపు
► రెగ్యులేటరీ నిబంధనలను పాటించని నేపథ్యం
► మరికొన్ని కంపెనీలపైనా చర్యలకు సమాయత్తం
► నల్లధనంపై మరో కీలక నిర్ణయం
నల్లధనం నిరోధించే దిశలో కేంద్రంలోని మోదీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెగ్యులేటరీ నిబంధనలను పాటించని 2.09 లక్షల కంపెనీలను రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్(ఆర్వోసీ) నుంచి తొలగించింది. ఇందులో భాగంగా ఆయా బ్యాంక్ ఖాతాల స్తంభనకూ ఆదేశాలు ఇచ్చింది. ఆయా సంస్థలపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. మరికొన్ని కంపెనీలపైనా ఇదే విధమైన చర్యలకు అవకాశం ఉందని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. నిబంధనలు పాటించకుండా, చాలాకాలం నుంచి వ్యాపారం చేయకుండా ఉంటున్న కంపెనీల ఆర్థిక కార్యకలాపాలపై నిఘా పెట్టాలని బ్యాంకులను ఆదేశించినట్లు ఆర్థికశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీనికి సంబంధించి ఇంకా ఆయన తెలిపిన అంశాలు క్లుప్తంగా...
♦ తప్పు చేసిన కంపెనీలను వదిలిపెట్టడం జరగదు. కార్పొరేట్ ప్రమాణాల మెరుగుదలకు ఈ చర్యలు దోహదపడతాయి. వ్యవస్థ ప్రక్షాళన దిశలో ఇదొక ముందడుగు.
♦ కంపెనీల చట్టంలోని 248 (5) సెక్షన్ ప్రకారం మొత్తం 2,09,032 కంపెనీలను రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ నుంచి తొలగించడం జరిగింది. ఈ చర్యతో ఆయా కంపెనీల ప్రస్తుత డైరెక్టర్లు, ఆథరైజ్డ్ సిగ్నేటరీస్ తమ హోదాలను కోల్పోయి, మాజీలుగా మారతారు.
♦ డీమోనిటైజేషన్ సమయంలో నల్లడబ్బును వ్యవస్థలోకి తీసుకురావడానికి ఈ కంపెనీలు (తాజా డీరిజిస్టర్డ్) తమ అకౌంట్లను వినియోగించుకున్నాయా? ఆయా అంశాలకు సంబంధించి ఈ కంపెనీల కార్యకలాపాలు ఏమన్నా ఉన్నాయా? అన్న అంశంపై సైతం సమగ్ర విశ్లేషణ ప్రారంభమైంది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









