వర్జిన్ మొబైల్: నెలపాటు ఉచిత సర్వీస్
- September 06, 2017
దుబాయ్‌కి చెందిన ఎమిరేట్స్ ఇంటిగ్రేటెడ్ టెలి కమ్యూనికేషన్స్ కంపెనీ (ఇఐటిసి), యూఏఈలో విర్జిన్ మొబైల్ సర్వీస్‌ని ప్రారంభించింది. వర్జిన్ మొబైల్ యూఏఈ యాప్, గూగుల్ ప్లే మరియు యాపిల్ యాప్ స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా వినియోగదారులు తాము కోరుకున్న నెంబర్ని పొందవచ్చు. అలాగే, నచ్చిన ప్లాన్‌ని ఎంపిక చేసుకోవచ్చు. వర్జిన్ మొబైల్ యూఏఈ సిమ్కార్డ్ని, తమ ఇంటివద్దనే డెలివరీ పొందడానికి ఈ యాప్ అవకాశం కల్పిస్తుంది. స్టోర్‌ని సందర్శించకుండానే అన్ని రకాల సేవలూ పొందేలా ఈ యాప్‌ని రూపొందించారు. ఇఐటిసి సిఇఓ ఒస్మాన్ సుల్తాన్ మాట్లాడుతూ, వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు ఎంతో శ్రమించామనీ, వర్జిన్ మొబైల్, ఈ రంగంలో కొత్త చరిత్ర సృష్టిస్తుందనీ చెప్పారు. వర్జిన్ గ్రూప్ ఫౌండర్ రిచార్డ్ డ్రాస్నన్ మాట్లాడుతూ, వర్జిన్ మొబైల్ బ్రాండ్‌ని యూఏఈలో ప్రారంభిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. యూఏఈలో తాము మంచి మార్కెట్ సంపాదిస్తామనీ, వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తామని చెప్పారాయన.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్‌లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్‌లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







