ఖాతాదారులకు షాక్ ఇచ్చిన ఎస్బిఐ
- September 07, 2017
ఎస్బిఐ తన ఖాతాదారులకు షాక్ ఇస్తోంది. తమ ఖాతాల్లో కనీస నగదు నిల్వ లేకపోతే ఫెనాల్టీ విధించనుంది. మెట్రో నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని ఖాతాదారులు తమ ఖాతాల్లో కనీస నగదు నిల్వ లేకపోతే ఫెనాల్టీ విధించనుంది ఎస్బిఐ
తమ ఖాతాదారులకు సంబంధించి ఎస్బీఐ బ్యాంకు పెనాల్టీ బాదుడుకు రంగం సిద్ధం చేసింది. ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్లలో కనీస మొత్తాన్ని నిల్వ ఉంచాలని గతంలో సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. మెట్రో నగరాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో ఖాతాదారులు ఎంతెంత మొత్తాన్ని నిల్వ ఉంచాలో కూడా గతంలో ఎస్బీఐ ప్రకటించింది.
కనీస మొత్తాన్ని నిల్వ ఉంచని ఖాతాదారులకు పెనాల్టీ విధిస్తామని కూడా హెచ్చరించింది. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితం లేకపోవడంతో ఇక జరిమానా విధించాలని ఎస్బీఐ నిర్ణయించింది.
జీఎస్టీ 18శాతం కలుపుకుని ఈ పెనాల్టీని ఎస్బీఐ విధించనుంది. దశలవారీగా, బ్రాంచీల వారీగా ఈ పెనాల్టీని విధించనుంది. ఈ పెనాల్టీ మొత్తం 100 రూపాయలకు పైగానే ఉండబోతోంది. ఈమేరకు కనీస మొత్తం నిర్వహించని ఖాతాలపై లెవీ చార్జీలు విధించేందుకు ఆర్బీఐ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దీంతో ఎస్బీఐ దూకుడు పెంచింది. అయితే ఈ పెనాల్టీ మెట్రో నగరాల్లో ఒక విధంగా, గ్రామీణ ప్రాంతాల్లో మరో విధంగా ఉండనుంది. ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ సమాచారం
మెట్రో నగరాల్లోని ఎస్బిఐ ఖాతాధారులు తమ ఖాతాల్లో కనీసం రూ. 5 వేల నగదునల్వ ఉంచుకోవాల్సిందే. సెమీ అర్భన్ ప్రాంతాల్లో రూ.3వేలు, అర్బన్ ప్రాంతాల్లో రూ2 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.వెయ్యి రూపాయాలను కనీస నగదు నిల్వలను ఉండేలా చూడాలి. లేకపోతే ఫెనాల్టీ వేయనున్నట్టు ఎస్బిఐ ప్రకటించింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









