తగ్గుముఖం పడుతున్న పసిడి మరియు వెండి ధరలు
- September 07, 2017
వరుసగా మూడు రోజుల పాటు పెరుగుతూ ఏడాది గరిష్ఠ స్థాయిని అందుకున్న పసిడి ధర గురువారం తగ్గుముఖం పట్టింది. రూ.190 తగ్గడంతో పది గ్రాముల బంగారం ధర రూ.30,360కి చేరుకుంది. స్థానిక ఆభరణాల తయారీదారుల దగ్గర నుంచి కొనుగోళ్లు మందగించడంతో బంగారం ధర పడిపోయినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. పసిడి బాటలోనే వెండి పయనించింది. వెండి ధర రూ.100 తగ్గి రూ.42వేల మార్కు దిగువకు పడిపోయింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.41,900కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణెల తయారీదారుల దగ్గర నుంచి డిమాండ్ ఆశించిన మేర లేకపోవడంతో ధర తగ్గినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయంగా బంగారం ధర 0.44శాతం తగ్గడంతో ఔన్సు 1,333.50 డాలర్లు పలికింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









