సాంకేతిక సమస్యతో తిరిగొచ్చిన విమానం
- September 07, 2017
యూఏఈ: ఆస్ట్రేలియాకి చెందిన క్వాంటాస్ విమానయాన సంస్థ నిర్వహిస్తోన్న ఎయిర్‌బస్ ఎ388 విమానం దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన వెంటనే తిరిగి వెనక్కి వచ్చేసింది. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ అవేర్ వెల్లడించిన వివరాల ప్రకారం సాంకేతిక సమస్యతో దుబాయ్ చుట్టూనే చక్కర్లు కొట్టి, తిరిగి క్షేమంగా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యింది. క్వాంటాస్ అధికార ప్రతినిథి మాట్లాడుతూ, విమానానికి సంబంధించిన ఎయిర్ కండిషన్డ్ సిస్టమ్‌లో ఏర్పడ్డ చిన్నపాటి సాంకేతిక సమస్య కారణంగానే విమానం టేకాఫ్ అయిన తర్వాత తిరిగి వెనక్కి రప్పించేసినట్లు తెలిపారు. ప్రయాణీకులకు తగిన ఏర్పాట్లను చేసినట్లు విమానయాన సంస్థ ప్రతినిథులు వివరించారు.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









