బహ్రెయిన్‌: లేబర్‌ క్యాంప్‌లో కార్మికుల పరిస్థితి దయనీయం

- September 07, 2017 , by Maagulf
బహ్రెయిన్‌:  లేబర్‌ క్యాంప్‌లో కార్మికుల పరిస్థితి దయనీయం

మనామా: అల్‌ మువాతాసిమ్‌ అవెన్యూలో కార్మికులు అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో నివసిస్తున్నారు. మొత్తం ఆ భవనమంతా దారుణమైన పరిస్థితుల్లో ఉందని కార్మికులు తెలిపారు. కనీసపాటి మరమ్మత్తులు అయినా చేయాలని ఎన్నిసార్లు ల్యాండ్‌లార్డ్‌కి చెప్పినా పట్టించుకోలేదని వారు వాపోయారు. నీటిని, కరెంట్‌నీ కట్‌ చేసేస్తే తమ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందని భావించే ఏమీ చేయలేకపోతున్నామని వారు అన్నారు. సాయంత్రం వేళల్లో కరెంట్‌, వాటర్‌ ఎందుకు రావడంలేదని ల్యాండ్‌లార్డ్‌ని ఒక్కోసారి ప్రశ్నిస్తే, ఇడబ్ల్యుఎ అధికారులు వాటిని కట్‌ చేసేస్తున్నారని సమాధానమిచ్చారని ఓ నివాసితుడు తెలిపారు. ఇక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళాలంటే ఆర్థికంగా ఇబ్బందులు పెరుగుతాయనీ, అందుకే సర్దుకుపోతున్నట్లు కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. 100 మందికి పైగా కార్మికులు చిన్నపాటి వాటర్‌ ట్యాంక్‌ మీద ఆధారపడి ఉంటున్నారక్కడ. అధికారులు మాత్రం ఆ ప్రాంతంలో నీటి సమస్యగానీ, కరెంట్‌ సమస్యగానీ లేదని చెబుతున్నారు. వాటర్‌ మరియు ఎలక్ట్రిసిటీ ఛార్జీలు తగ్గించుకోవడానికి ఓనర్‌ అలా వ్యవహరిస్తున్నట్లు వారు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com