వేశ్య పాత్రలో నటించనున్న ప్రముఖ హీరోయిన్ సదా
- September 07, 2017
కొన్నేళ్ల క్రితం హోమ్లీ, గ్లామరస్ పాత్రలతో మెప్పించిన సదా ప్రస్తుతం అవకాశాలు లేక సతమతమవుతోంది. ఇప్పుడు ఆమె చేతిలో ఒకే ఒక్క చిత్రం 'టార్చ్‌లైట్'. 1980ల నాటి నేపథ్యంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో నటీనటులు ధరించే దస్తులు, లొకేషన్లు అన్నీ ఆనాటి వాతావరణానికి తగ్గట్టే ఉంటాయట. ఇందులో సదా వేశ్య పాత్రలో నటిస్తుండగా, ఆమె ఆహార్యం కూడా వైవిధ్యంగా ఉండబోతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. తిరునల్వేలి, కుట్రాలం పరిసరాల్లో గ్రామాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. జీవితంపై ఎన్నో కలలు ఉన్న ఒక అమ్మాయి వేశ్యగా ఎలా మారింది? అందుకు దారితీసిన పరిస్థితులేంటి? అన్న కథతో దర్శకుడు మజీద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వేశ్య పాత్రలో నటించేందుకు మొదట సంశయించినా దర్శకుడు చెప్పిన కథ విన్నాక కళ్లలో నీళ్లు తిరిగాయని, వెంటనే ఓకే చెప్పేశానని సదా చెబుతోంది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









