నైజీరియా లో రెచ్చిపోయిన బొకోహరాం మిలిటెంట్లు
- September 09, 2017
నైజీరియాలో బొకోహరాం మిలిటెంట్లు జరిపిన దాడుల్లో ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బోర్నో రాష్ట్ర రాజధాని మైదుగురిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పొరుగునే ఉన్న కామెరూన్లో తీవ్రవాద కార్యకలాపాలతో నిరాశ్రయులైన వారికి మైదుగురి సమీపంలో ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది.
ఇక్కడి శిబిరాల్లో సుమారు 80 వేల మంది నైజీరియా పౌరులు తలదాచుకుంటున్నారు. ఈ క్రమంలో బొకోహరాంనకు చెందిన తీవ్రవాదులు ఈ శిబిరాలపై కాల్పులు జరపటంతో ఏడుగురు చనిపోయారు. రాత్రివేళ కావటంతో అందరూ నిద్రిస్తున్నారని, అందుకే మృతుల సంఖ్య తక్కువగా ఉందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం







