ఓయూలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు
- September 09, 2017
హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో ప్రజాకవి, పద్మభూషణ్ కాళోజి నారాయణ రావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన జన్మదినం సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవాన్ని, కాళోజీ జయంతిని సంయుక్తంగా ఆర్ట్స్ కళాశాల తెలుగు శాఖ ఆధ్వర్యంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆచార్యులు, పరిశోధకులు మాట్లాడుతూ కాళోజీ వ్యక్తిత్వాన్ని కొనియాడారు. తెలంగాణ భాషా వైశిష్ట్యాన్ని, తెలంగాణ మాండలికాన్ని కాళోజి నిర్భయంగా ఉపయోగించిన తీరును వివరించారు.
ఆయన నిరాడంబర జీవితాన్ని గుర్తు చేస్తూ, జీవితాంతం బడుగు బలహీనుల కోసం కలాన్ని కదిపిన మహనీయుడని అన్నారు. ఎవరికి కష్టం వచ్చినా కంటతడిపెట్టే సున్నితమైన మనసుగలవారని, అదే సమయంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఒంటరిగా ప్రశ్నించే దీశాలి అని కొనియాడారు. కాళోజి అందించిన స్ఫూర్తిని ప్రతిఒక్కరూ అందుకోవాలన్నారు. తెలంగాణా భాష, యాసల ఖ్యాతిని నలుదిశలా విస్తరింపజేయాల్సిన బాధ్యత భావి పరిశోధకులపై ఉందన్నారు. ఈ కార్యమంలో ఆర్ట్స్ కళాశాల ఉప ప్రధానాచార్యులు, తెలుగు శాఖ అధ్యక్షులు పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







