పవిత్ర మసీదులలో ప్రార్థనలలో పాల్గొన్న రెండు లక్షలమంది
- September 09, 2017
మక్కా: సుమారు రెండు లక్షలమంది హజ్ యాత్రికులు, సందర్శకులు మక్కాలోని గ్రాండ్ మాస్క్ మరియు మదీనాలో ప్రవక్త యొక్క మస్జిద్ లో శుక్రవారం ప్రార్ధనలను చేశారు.గ్రాండ్ మసీదులోని అన్ని అంతస్తులు మరియు ప్రాంగణాలు మరియు కింగ్ అబ్దుల్లా విస్తరణ ప్రాజెక్టులలో ఆరాధకుల వరుసలతో నిండిన ప్రాంగణాల్లో భక్తులు కిట కిటలాడేరు, ప్రక్కనే ఉన్న వీధులు మరియు భవనాల పై భాగం వరకు హజ్ యాత్రికులు ఉన్నారు. వార్షిక పుణ్యక్షేత్రం చూసేందుకు అసమాన ఆధ్యాత్మిక వాతావరణంలో, ఒక లక్షమంది కంటే ఎక్కువ మంది హజ్ యాత్రికులు సర్వోన్నుతుడైన అల్లాహ్ నుండి దీవెనలు మరియు క్షమాపణ కోరుతూ ఇస్లాం పవిత్ర పుణ్యక్షేత్రంలో ప్రార్ధనలు జరిపేరు. గ్రాండ్ మస్జిద్ యొక్క ఇమామ్ మరియు ఖాతెబ్ షేక్ ఖలేద్ అల్-గంది శుక్రవారం ఉపన్యాసంలో మాట్లాడుతూ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సంపూర్ణంగా దేవునికి లొంగిపోయారు మరియు ఏ అభ్యంతరం మరియు విసుగు లేకుండా ప్రశాంతతను మరియు ఆనందంతో, హజ్ ఒక బాధ్యతాయుతమైన ఆచారంగా కొనసాగించారు. అదే విధంగా మదీనాలో ఇమాం మరియు ఖైతేబ్ షేక్ అబ్దుల్ మహ్సేన్ అల్ ఖాసిం శుక్రవారం ఉపన్యాసం ఇచ్చారు, మొత్తం ఆరాధకులు సుమారు 155,000 మంది హజ్ యాత్రికులు ఆ సమయంలో అక్కడ ఉన్నారు, వారు ప్రవక్త యొక్క మసీదును సందర్శించి, హజ్ ఆచారాలను పూర్తి చేసిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు నమస్సులను తెలియజేశారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







