30 వస్తువులపై జీఎస్టీ పన్నుశాతం తగ్గింపు.!
- September 09, 2017
హెచ్‌ఐసీసీలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జీఎస్టీ రిటర్న్స్ దాఖలుకు అక్టోబర్ 10వరకు గడువు పొడిగించారు. అందరూ ఒకేసారి ఫైల్ రిటర్న్స్ దాఖలు చేయడం వల్ల నెట్‌వర్క్‌పై భారం పడుతోందని అరుణ్ జైట్లీ చెప్పారు. 30 వస్తువులపై జీఎస్టీ పన్నుశాతం తగ్గించినట్లు తెలిపారు. చింతపండు, ఇడ్లీ, దోశ బ్యాటన్‌లు, రెయిన్‌కోట్లపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించామన్నారు. రబ్బర్ బ్యాండ్లపై జీఎస్టీ 18 నుంచి 12 శాతం తగ్గించామని, చిన్న కార్లపై అదనపు భారం లేకుండా చూడాలని చెప్పారు. చిన్న కార్లపై జీఎస్టీ 48 నుంచి 43 శాతానికి తగ్గించామన్నారు జైట్లీ.
పెద్ద కార్లపై సెస్ 5 శాతం పెంచినట్లు జైట్లీ చెప్పారు. స్పోర్ట్స్ కార్లపై 7 శాతం పెంచామన్నారు. నాలుగు రకాల వాహనాలపై యథా స్థితి కొనసాగింపు ఉంటుందన్నారు. కేసీఆర్ విజ్ఞప్తులపై వచ్చే సమావేశంలో చర్చిస్తామన్నారు. చేనేత రవాణా, విక్రయాలకు రూ.20 లక్షల వరకు మినహాయింపు ఉంటుందని చెప్పారు. 1200 సీసీ పెట్రోల్, 1500 సీసీ డీజిల్ కార్లపై జీఎస్టీ యథాతథంగా ఉంటుందన్నారు. చేనేత రంగంలో రూ.20 లక్షల కంటే తక్కువ లావాదేవీల నిర్వహణకు కొంత మినహాయింపు ఉంటుందని జైట్లీ తెలిపారు.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







