ఆధార్ కార్డు ఇవ్వు - బతుకమ్మ చీర పట్టు
- September 10, 2017
బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, పేదింటి ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ మేరకు 18 ఏళ్ళు పైబడిన యువతులు, మహిళలకు చీరలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా బతుకమ్మ చీరలు పౌరసరఫరాల శాఖ గోదాములకు చేరుతున్నాయి. ఈనెల 18 నుంచి రేషన్ దుకాణాల ద్వారా వీటిని పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 9,72,274 మంది జనాభాలో 8,15,115 మందికి ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. ఈ కార్డుదారుల జాబితాలో 4,40,216 మంది మహిళలు ఉండగా వీరిలో 18 ఏళ్ళ పైబడిన వారు 3,31,214 మంది ఉన్నారు.
ఆధార్ కార్డు, రేషన్ కార్డు తప్పనిసరి
బతుకమ్మ చీరలను తీసుకునేందుకు వచ్చే మహిళలు తమ ఆహార భద్రత కార్డుతోపాటు ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను తీసుకుని రావాల్సి ఉంటుంది. జిరాక్స్ ప్రతులను రేషన్ దుకాణదారుడికి అందజేసి చీరలను తీసుకోవాలి. వయసు ధృవీకరణతోపాటు వ్యక్తిని గుర్తించేందుకు ఆధార్ కార్డును జత చేయాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









