బహ్రెయిన్‌ భారతీయ వలసదారుడి మృతదేహానికి అంత్యక్రియలు

- September 12, 2017 , by Maagulf
బహ్రెయిన్‌ భారతీయ వలసదారుడి మృతదేహానికి అంత్యక్రియలు

మనామా: భారతీయ వలస కార్మికుడు తాండవమ్‌, జులై 9న తుది శ్వాస విడిచినా, స్వదేశానికి ఆయన మృతదేహాన్ని పంపేందుకు పలు సమస్యలు ఎదురయ్యాయి. అన్ని ఫార్మాలిటీస్‌ పూర్తి చేసి, మృతదేహాన్ని ఎట్టకేలకు స్వదేశానికి పంపారు. ఈ క్రమంలో ఓవర్సీస్‌ ఇండియన్‌ కల్చరల్‌ కాంగ్రెస్‌, బహ్రెయిన్‌ ఇవేండ్రమ్‌ డిస్ట్రిక్ట్‌ కమిటీ ప్రెసిడెంట్‌ షాజి బాధిత కుటుంబానికి సాయపడ్డారు. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ద్వారా మృతదేహాన్ని శనివారం తరలించారు. 35 ఏళ్ళ క్రితం తమిళనాడులోని పెరంబదూర్‌ నుంచి బహ్రెయిన్‌కి వచ్చిన తాండవన్‌, గత ఏడాది డాక్యుమెంట్స్‌ని పోగొట్టుకోవడంతో అక్రమ వలసదారుడిగా మారారు. 58 ఏళ్ళ తాండవన్‌ జులై 9న ప్రాణాలు కోల్పోగా, అతని మృతదేహాన్ని సలామానియా మెడికల్‌ కాంప్లెక్స్‌ మార్చురీలో ఉంచారు. మృతదేహం బంధువులకు చేరడంతో, వారు ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com