బహ్రెయిన్ ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ఆర్థిక సాయం..
- September 12, 2017
బహ్రెయిన్: బహ్రెయిన్ లో ఇటీవల ప్రమాదవశాత్తు మృతిచెందిన మార్కంటి బాబు(34) కుటుంబానికి బహ్రెయిన్ ఎన్నారై టీఆర్ఎస్ సెల్ విభాగం, తోటి కార్మికులు రూ. 120,309 ఆర్ధిక సాయం అందించారు. తెలంగాణ కామారెడ్డి జిల్లా, గాంధారి మండలం, పోలంగల్ కలాన్ గ్రామానికి చెందిన మార్కంటి బాబు బతుకు దెరువు కోసం బహ్రెయిన్కు వెళ్లాడు. అక్కడ ఓ ప్రయివేట్ కంపేనీలో విధులు నిర్వహిస్తూ గత నెల ఆగష్టు 8న ప్రమాదవశాత్తు మరణించాడు.
అతడి పార్దీవ దేహాన్ని ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఆగష్టు 23న స్వగ్రామానికి పంపించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. బాబు మరణంతో ఆకుటుంబం పెద్ద దిక్కు కోల్పోయింది. దీంతో ఆ కుటుంబానికి అండగా బహ్రెయిన్ టీఆర్‌ఎస్ ఎన్నారై సెల్, తోటి కార్మికులు, రూ. 120,309 చెక్‌ను పంపించి ఆర్ధిక సాయం చేశారు.
సాయం చేసిన వారిలో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి, జనరల్ సెక్రెటరీ డా రవి, సెక్రెటరీలు రవిపటేల్ దెషెట్టి, సుమన్ అన్నారం, గంగాధర్ గుమ్ముల, సంజీవ్ బురమ్, విజయ్ ఉండింటి, సుధాకర్ ఆకుల, నర్సయ్య, Ch రాజేందర్, వినోద్, సాయన్న, వసంత్ తదితరులున్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







