నవంబరులో ఐఆర్‌సీటీసీ దుబాయ్ యాత్ర
- September 12, 2017
ముచ్చటగా మూడోసారి దుబాయ్‌యాత్రకు ఐఆర్‌సీటీసీ(ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) సిద్ధమైంది. నవంబరు 4న ఉదయం 10.15 గంటలకు నగరం నుంచి బయలుదేరి తిరిగి 8న తెల్లవారుజామున 2.45 గంటలకు చేరుకునే విధంగా ఈ యాత్రను రూపొందించింది. దుబాయ్, అబుదాబీలో పర్యటన ఉంటుంది. షాపింగ్ చేయాలనుకునేవారితోపాటు భోజన ప్రియులకు కూడా ఈ యాత్ర ఎంతో సరదాగా సాగిపోతుందని ఐఆర్‌సీటీసీ జేజీఎం ఎన్. సంజీవయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఎమిరేట్స్ విమాన ప్రయాణం, 3 నక్షత్రాల ఏసీ వసతి, ఏసీ ప్రయాణం, అల్పాహారం, భోజనం, వీసా, బీమా, చూడవలసిన ప్రదేశాల్లోని ప్రవేశ రుసుం ఇలా అన్ని సౌకర్యాలను ఐఆర్‌సీటీసీ కల్పిస్తోంది. స్థానిక పర్యాటక ప్రాంతాల వివరాలను తెలిపేందుకు గైడ్‌తోపాటు ఐఆర్‌సీటీసీ టూర్ మేనేజర్ పర్యాటకులతో వెళ్లి వస్తారు.
టిక్కెటు ధరలిలా..
ఒక్కరే బస చేసే సౌకర్యం కావాలనుకుంటే.. రూ.68059, ఇద్దరు లేదా ముగ్గురు కలిసి బస చేయడానికి సిద్ధమైతే రూ. 59814 ఒక్కో టిక్కెట్ ఖరీదు చెల్లించాల్సి ఉంటుంది. 2 నుంచి 11 ఏళ్ల పిల్లఉ నిద్ర పోయేందుకు ప్రత్యేకంగా పడక కావాలనుకుంటే రూ. 55495, పడక అక్కర్లేదనుకుంటే రూ.54056 చెల్లిస్తే సరిపోతుంది.
చూడనున్న పర్యాటక ప్రాంతాలు..:
క్రూయిజ్‌లో ప్రయాణం చేసి.. అందులోనే రాత్రి భోజనం చేస్తారు. అబుదాబిలోని మసీదు, షేయ్ జయీద్ సెంటర్, అబుదాబి పురాతన గ్రామం, విమానాశ్రయం, అతిపెద్ద మానవ నిర్మితమైన పోర్టు, దుబాయ్ సిటీ యాత్ర, ఇసుక తిన్నులపై ప్రయాణం, బీబీక్యూ రాత్రి భోజనం, బెల్లీ నృత్యం చూడవచ్చు. బుర్జ్‌ఖలీఫా, దుబాయ్ మాల్ సందర్శన ఉంటుంది.
వివరాలకు: 04027702407, 23800580, 23400606 9701360605/647/671/701/698 నంబర్లతో పాటు www.irctctourism.com వెబ్‌సైట్లో సమాచారాన్ని పొందవచ్చు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







