స్కూళ్ళ రిపెయిర్లపై విద్యార్థుల తల్లిదండ్రుల అసంతృప్తి
- September 14, 2017జెడ్డా: జెడ్డాలో స్కూళ్ళ రిపెయిర్లకు సంబంధించి విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో అసమనం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలల సమ్మర్ వెకేషన్ అనంతరం స్కూళ్ళలో ఏర్పాట్లను పరిశీలించిన విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి వీలుగా పాఠశాలల్లో సౌకర్యాలు లేవని ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తగు రీతిలో చర్యలు తీసుకోకపోవడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. నాలుగు నెలల కాలంలో మొత్తం 650 స్కూళ్ళలో రిపెయిర్ వర్క్‌లను చేపట్టినట్లు చెబుతున్న డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అబ్దుల్లా అహ్మద్ అల్ థకాఫి, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్లు పరిస్థితులు అధ్వాన్నంగా లేవని అన్నారు. అయితే కొన్ని చోట్ల ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వెంటనే సరిదిద్దుతామని ఆయన వివరించారు. ఆదివారం నుంచి కొత్త విద్యా సంవత్సరం కోసం స్కూళ్ళు తెరవబడ్తాయి.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్‌లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్‌లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







