హీరో నాని చుట్టూ తిరుగుతున్న డైరెక్టర్లు
- September 15, 2017
నేచురల్ స్టార్ నానీ ప్రతి సినిమా డిఫరెంట్ గా ఉంటుంది. చాలా సెలక్టివ్‌గా పాత్రలని ఎన్నుకుంటాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ గుప్పించకుండా, ఫైట్సూ గట్రా ఏమీ లేకుండా హాయిగా ఆహ్లాదంగా అని పిస్తుంది నానీ సినిమా చూస్తుంటే. చాలా కూల్‌గా నటించేస్తాడు. అందుకే నానీ నటించిన సినిమాలు దాదాపు సక్సెస్ బాట పడుతుంటాయి. ఈ ఏడాది తను నటించిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యి, నానీ సినిమా నెక్ట్సేంటి అనే స్థాయిలో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం 'మిడిల్ క్లాస్ అబ్బాయి' చేస్తూనే.. మరోవైపు 'కృష్ణార్జున యుద్ధం' చేస్తున్నాడు. ఈనేపథ్యంలో నానీతో సినిమాలు చేయడానికి దర్శకులు క్యూ కడుతున్నారు. వాళ్లలో తాతినేని సత్య కూడా ఒకరు. ఇంతకు ముందు నానీతో 'భీమిలీ కబడ్డీ జట్టు' సినిమా చేసిన సత్య మరో కథను నానీ కోసం సిద్దం చేశారట. మరీ ఈ కథ నానీకి నచ్చితే షూటింగ్ వెంటనే మొదలు పెట్టాలనుకుంటున్నట్లు సత్య తెలిపారు.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్‌పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







