తెలంగాణ ఆర్టీసీ మొబైల్ యాప్
- September 15, 2017
ఆర్టీసీ ప్రయాణికులు ఇక ఏ ప్రాంతం నుంచైనా బస్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. వెళ్లాలనుకున్న ప్రాంతాల కు సీట్లను రిజర్వ్ చేసుకోవచ్చు. బస్సులో ఎన్ని సీట్లు రిజర్వ్ అయ్యాయి, ఎన్ని మిగిలి ఉన్నాయి, ఏయే నంబర్ సీట్లు ఖాళీగా ఉన్నాయన్న వివరా లు తెలుసుకోవచ్చు. ఇలాంటి సమగ్ర సమాచారంతో టీఎ్సఆర్టీసీ త్వరలో ఓ మొబైల్ యాప్‌ను రూపొందించనుంది. సంస్థలోని సాంకేతిక నిపుణులు ఈ సమాచారాన్ని క్రోడీకరిస్తున్నారు. ఈ యాప్ ప్రజలకు త్వరలో అందుబాటు లోకి రానుందని ఆర్టీసీ వర్గా లు తెలిపాయి. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆన్లైన్ బస్ టికెట్ల బుకింగ్ సౌకర్యం ఇళ్లలో కంప్యూటర్లు ఉన్నవారికి మాత్రమే ఉపయోగపడుతోంది. కంప్యూటర్లు లేని వారి కోసమే ఆర్టీసీ మొబైల్ యాప్ తీసుకురానుంది. ఉబర్, ఓలా వంటి క్యాబ్ సర్వీసుల నిర్వాహకులు ప్రత్యేక మొబైల్ యాప్‌లతో సేవలందిస్తున్న విషయం తెలిసిందే. ఆర్టీసీ తీసుకొచ్చే యాప్‌ను కూడా శాశ్వతంగా మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలనుకున్నప్పుడల్లా యాప్‌ను ఓపెన్ చేసి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలో ఉంటే క్యాబ్‌ల మాదిరిగా ఎక్కడి నుంచైనా ఆర్టీసీ సీట్లు రిజర్వ్ చేసుకోవచ్చు.
సర్వీస్ నంబర్లను ఎంటర్ చేయగానే బస్సులో ఖాళీ సీట్లు, రిజర్వ్ అయిన సీట్ల వివరా లు తెలుస్తాయి. సర్వీస్ నంబర్లు కూడా రూట్ ఆధారంగా తెలిసిపోతాయి. బహుళ ప్రయోజకారి యాప్‌ను త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!









