స్పైడర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సూపర్ స్టార్ స్పీచ్
- September 15, 2017
తాను మొదట సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు వచ్చిన మొదటి ఛాన్స్ తమిళంలోనే. కానీ తమిళం రాకపోవడంవల్ల ఆ అవకాశాన్ని కోల్పోయానని అంటున్నారు కృష్ణ. మహేష్ నటించిన 'స్పైడర్' ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. అలా తమిళంలో అవకాశం కోల్పోయినా తెలుగులో ఆదుర్తి సుబ్బరావుగారు 'తేనె మనసులు'లో అవకాశం ఇచ్చారు. 350కి పైగా చిత్రాల్లో నటించిన తనపై అభిమానులు చూపిస్తున్న ఆదరణ మరువలేనిదని అన్నారు. అయితే ఇప్పుడు మహేష్ స్పైడర్ చిత్రం ద్వారా తమిళ ఇండస్ట్రీకి పరిచయం కావడం, ఈ సినిమా కోసం తమిళంలో డైలాగులు చెప్పడం తనకెంతో ఆనందాన్నిస్తుందని అన్నారు. ఒక్కో సినిమాకు మహేష్‌లో కనబడుతున్న పరిణతిని చూసి తండ్రిగా ఒకింత గర్వపడుతున్నానని అన్నారు. స్పైడర్ చిత్రం ట్రైలర్ చాలా బావుందని, ఈ చిత్రం విజయవంతం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు కృష్ణ తెలిపారు. కృష్ణ భార్య విజయనిర్మల చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా







