లండన్‌లో బాంబు దాడి మా పనే.. ప్రకటించిన ఇస్లామిక్ స్టేట్

- September 16, 2017 , by Maagulf
లండన్‌లో బాంబు దాడి మా పనే.. ప్రకటించిన ఇస్లామిక్ స్టేట్

లండన్‌లోని భూగర్భ రైలులో జరిగిన బాంబు పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు ఐసిస్‌ ప్రకటించింది. ఈ విషయాన్ని యూకే మీడియా వర్గాలు ధ్రువీకరించాయి. లండన్‌ మెట్రోలో బాంబును పేల్చాం.అంటూ ఐసిస్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. 
పార్సన్స్‌ గ్రీన్‌ స్టేషన్‌లోని డిస్ట్రిక్టు లైన్‌ రైలులో పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ పేలుడులో 29 మంది గాయపడ్డారు. పేలుడు నుంచి తప్పించుకోవడానికి ప్రయాణికులు పరుగులు పెట్టడంతో స్వల్పంగా తొక్కిసలాట జరిగింది. టైమర్‌ ద్వారా ఈ బకెట్‌ బాంబును పేల్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. యూకేలో ఈ ఏడాది జరిగిన ఐదో ఉగ్రచర్య ఇది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com